మలప్పురం : అలనాటి మలయాళ నటుడు మముక్కోయ (76) ఇక లేరు. బుధవారం (ఏప్రిల్ 26న) తుదిశ్వాస విడిచారు. కేరళలోని మలప్పురం జిల్లా వందూర్‌లో ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన మముక్కోయ.. ఛాతిలో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలారు. దాంతో ఆయనను వెంటనే మలప్పురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
మముక్కోయ..కార్డియాక్ అరెస్టుతో కుప్పకూలారని వైద్యులు తేల్చారు. కార్డియాక్ అరెస్ట్ అనంతరం ఆయన మెదడు రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం జరిగిందన్నారు. చికిత్స పొందుతూ బుధవారం (ఏప్రిల్ 26న) ఉదయం మముక్కోయ తుదిశ్వాస విడిచారు. మముక్కోయ 1970లలో సినీరంగ ప్రవేశం చేసి చాలా సినిమాల్లో నటించారు.
థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన మాముక్కోయ ఆపై మళయాళ సినీ పరిశ్రమలోకి అడుడగుపెట్టి ప్రముఖ కమెడియన్, నటుడిగా ఎదిగారు. 450కిపైగా సినిమాల్లో నటించిన మముక్కోయకు పలు అవార్డులు లభించాయి.