ప్రస్తుతం మలయాళ సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే కేరళ పోలీసులు ఈ వ్యవహారంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే 18 మంది క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ లైంగిక వేధింపుల కేసులో మలయాళీ ప్రముఖ నటుడు ముఖేష్ పై కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ముఖేష్‌పై ఐపిసి సెక్షన్ 376 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఈరోజు (సెప్టెంబర్ 24) నటుడు ముఖేష్ ని సిట్ కమిటీ సభ్యులు కొచ్చిలో అరెస్ట్ చేసి దాదాపుగా మూడున్నర గంటల పాటూ విచారించారు. అనంతరం ముందస్తు బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారు.
ALSO READ | జానీకి బెయిలా.. కస్డడీనా..? రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ
ఈ విచారణలో నటుడు ముఖేష్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై వివిధ కోణాల్లో ప్రశ్నించారు. కొందరు తనని డబ్బు, అవకాశాల పేరుతో బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించారని కానీ తాను లొంగకపోయావడంతో ఈ విధంగా తనపై లైంగిక వేధింపుల కేసు బనాయించారని పోలీసుల విచారణలో నటుడు ముఖేష్ వెల్లడించాడు.
అలాగే తనపై తప్పుడు కేసు బనాయించి ఇబ్బందులకు గురి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు సమాచారం.