మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ (Nirmal Benny) గుండెపోటుతో మరణించారు. 37 ఏళ్ళ వయసులో బెన్నీ గుండెపోటుతో చనిపోవడంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్తను నిర్మాత సంజయ్ పడియూర్ బరువెక్కిన హృదయంతో స్పెషల్ నోట్ రాసి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
నిర్మల్ బెన్నీ మరణవార్త మలయాళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
హాస్యనటుడిగా తన కెరీర్‌ను ప్రారంభిన నిర్మల్ బెన్నీ..యూట్యూబ్ వీడియోలు మరియు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ద్వారా గుర్తింపు పొందాడు. 2012లో 'నవగాథార్కు స్వాగతం' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. తన కెరీర్‌లో, బెన్నీ ఓ ఐదు సినిమాలలో నటించాడు, వాటిలో అత్యంత ప్రసిద్ధమైనవి 'ఆమెన్'. ఆమేన్ అనేది లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించిన కామెడీ ఫిల్మ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా విజయం సాధించింది.