
ప్రముఖ మలయాళ నటుడు మరియు అమ్మ(మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) మాజీ జనరల్ సెక్రటరీ సిద్ధిక్ అత్యాచార ఆరోపణల కేసులో శుక్రవారం అరెస్ట్ అయ్యాడు. అనంతరం పోలీసులు సిద్ధిక్ ని కోర్టులో హాజరుపరిచారు. ఈ విచారణలో దర్యాప్తు అధికారి మాట్లాడుతూ సిద్ధిక్ పోలీసుల విచారణకి సహకరించలేదని తెలిపాడు. అంతేగాకుండా సుప్రీం కోర్టు ఇంటరాగేషన్ కి సహకరించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ సిద్ధిక్ వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాగే సిద్ధిక్ చర్యలు కేసుని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని కోర్టుకి తెలిపారు.
ఇక సిద్ధిక్ తరుపు న్యాయవాదులు మాట్లాడుతూ సిద్ధిక్ పై వచ్చిన అత్యాచారం, బెదిరింపుల ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాల్ని పాటిస్తూ సిద్ధిక్ పోలీసుల విచారణకి సహకరిస్తున్నాడని వాదించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు సిద్ధిక్ కి కండీషన్స్ తో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సిద్ధిక్ బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు.
ALSO READ : సినిమాల్లోకి రాకముందు అలాంటి సమస్యలతో బాధపడ్డ స్టార్ హీరో డాటర్.. కానీ ఇప్పుడు..
ఈ విషయం ఇలా ఉండగా నటుడు సిద్ధిక్ పై మలయాళ నటి తనపై అత్యాచారం, బెదిరింపులకి పాల్పడినట్లు 2019లో పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో నటుడు సిద్ధిక్ పై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 376 (రేప్), 506 (నేరపూరిత బెదిరింపు) తదితర సెక్షన్ల క్రింద కేసు నామోదు చేసి విచారిస్తున్నారు. సిద్ధిక్ పై కేసు నమోదవ్వడంతో ఇటీవలే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశాడు. ఈ మధ్య జస్టిస్ హేమ కమిటీ వ్యవహారం కలకలం సృష్టించడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.