మలయాళీ హీరోయిన్ అపర్ణ దాస్(Aparna Das) ప్రియుడు దీపక్ పరంబోల్(Deepak Parambol)తో ఆమె ఏడడుగులు వేసి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రీసెంట్గా మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్ ఫిల్మ్ అయిన ‘మంజుమ్మల్ బాయ్స్’లో నటించిన దీపక్ పరంబోల్‌ని ఆమె పెళ్లి చేసుకున్నారు.
బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం కేరళలోని గురువాయూర్ టెంపుల్ లో వీరిద్దరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. వీరి వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ బ్యూటిఫుల్ జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. 'బీస్ట్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరోయిన్ అపర్ణ తెలుగు,తమిళ,మలయాళ భాషల్లో నటిస్తూ బిజీగా మారింది.
ALSO READ | Allari Naresh: ఆ హీరో నా బాబాయ్..మా ఫ్యామిలీ మెంబర్‌లో ఒకడిగా ఉంటాడు
అపర్ణ, దీపక్‌లు ‘మనోకరం’ అనే మూవీలో నటించి..ఇక ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2018లో ‘న్యాన్ ప్రకాశన్’ సినిమాతో అపర్ణ దాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలాగే ‘దాదా’ మూవీలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. వైష్ణవ తేజ్ ‘ఆదికేశవ’, ‘సీక్రెట్ హోమ్’ వంటి చిత్రాలతో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.