మలయాళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటి అపర్ణ పి.నాయర్(Aparana p nair)(31) మృతిచెందారు. ఆమె గురువారం కర్మణా తాళిలోని తన ఇంట్లో ఉరివేసుకొని కనిపించారు. వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తెరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపియినట్టు వైద్యులు నిర్దారించారు. ఇక నటి అపర్ణ పి.నాయర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటంతో కంప్లైంట్ రిజిస్టర్ చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ALSO READ:అవకాశాల కోసం లొంగిపోయా.. అయినా కూడా!
ఇక నటి అపర్ణ పి.నాయర్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె 2009లో వచ్చిన మేఘతీర్థం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాదించడంతో ఆమెకు వరుస ఆఫర్స్ వరించాయి. ఈ క్రమంలోనే ముదుగావ్, మైథిలీ వీందుం వరున్ను, ఆచయన్స్, నిరంజనా పూక్కల్, దేవస్పర్శం వంటి సినిమాల్లో నటించింది అపర్ణ పి.నాయర్. ఆమెకు భర్త సంజీత్, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ వార్తతో కుంటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.