సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటి రెంజూష మీనన్(Renjusha Menon) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరువనంతపురం శ్రీకార్యం ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో సోమవారం ఉదయం శవమై కనిపించారు. ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెంజూష మీనన్ మరణవార్త తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
- ALSO READ | భయపెట్టించే మరో హారర్ మూవీ.. పిండం టీజర్ రిలీజ్
ఇక రెంజూషా మీనన్ విషయానికి వస్తే.. ఆమె మలయాళ ఇండస్ట్రీలో స్త్రీ అనే సీరియల్ ద్వారా..నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ ఫేమ్ తో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు రెంజూష. ఆమె చివరగా ఆనందరాగం అనే టీవీ షోలో కనిపించారు. ఆతరువాత కొంతకాలంగా ఆమె నటనకు దూరంగా ఉంటూ వస్తున్నారు.