మలయాళ నటి రేష్మ ప్రసాద్(Reshma prasad) కాస్టింగ్ కౌచ్‌పై సంచలన కామెంట్స్ చేసింది. తనకు కూడా అలాంటి సంఘటన ఎదురైందని, అందరు అనుకునేలా బయటకు కనిపించే ఇండస్ట్రీ వేరని కానీ.. లోపల జరిగేది వేరని ఆమె చెప్పు కొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
ALSO READ:నిహారిక లైఫ్లో స్పెషల్ అంటే వీళ్లేనట.. సింగల్ పోస్ట్తో చెప్పేసింది!
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మళయాళ ఇండస్ట్రీలో సినిమాలు, సీరియల్స్ ద్వారా నటి రేష్మ ప్రసాద్ అందరికి సుపరిచితమే. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా ఆమె సినీ ఇండస్ట్రీ గురించి చాల విషయాలు చెప్పుకొచ్చింది.. నేను కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న పాత్రల కోసం ఆడిషన్స్‌కు పిలిస్తే వెళ్లేదాన్ని. ఆ పాత్రలకు కూడా కమిట్మెంట్ అడిగేవారు. దానికి ఒప్పుకుంటే.. పాత్ర నీదే అని చెప్పేవారు. కొన్ని చోట్ల అయితే డైరెక్ట్ అప్లికేషన్స్ ఫామ్స్‌లో అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకుంటున్నావా? అని ప్రత్యేకంగా ఓ కాలమ్ కూడా ఉండేది. ఆ ఫామ్లో నో అని రాసినా.. దగ్గరకు వచ్చి మరీ అడిగేవారు. ఆ పరిస్థితి నాకు కూడా ఎదురైంది. ఆ ఒత్తిడికి తట్టుకోలేక నేను వారితో కమిట్మెంట్ కు ఒప్పుకున్నాను. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే.. మనకు పైకి కనిపించే ఇండస్ట్రీ వేరుగా ఉంటుందికానీ.. లోపల జరిగేది వేరు. ఇప్పటికైనా తమను తాము తెరపై చూసుకోవాలని కోరుకునే అమ్మాయిలకు ఇండస్ట్రీ నుండి మంచి వాతావరణాన్ని కల్పించాలని చెప్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది రేష్మ ప్రసాద్.