ప్రొడ్యూసర్స్ షాకింగ్ డెసిషన్... జూన్ 1నుంచి ఇండస్ట్రీ బంద్..

ప్రొడ్యూసర్స్ షాకింగ్ డెసిషన్... జూన్ 1నుంచి ఇండస్ట్రీ బంద్..

ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో సినిమా ఇండస్ట్రీలో చిన్నాచితకా నిర్మాతలు చిదిగిపోతన్నారు. ముఖ్యంగా కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయినట్లు కూడా ఆడియన్స్ కి తెలియడం లేదు. దీంతో రెమ్యునరేషన్స్ తీసుకుంటున్న హీరో, హీరోయిన్లు, దర్శకులు, ఇతర టెక్నీషియన్స్ ఇలా అందరూ సేఫ్ అవుతున్నారు.. కానీ చివరికి ఈ నష్టమంతా ప్రొడ్యూసర్స్ పై పడుతోంది. దీంతో మలయాళ ప్రముఖ సినీ నిర్మాత సురేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇండస్ట్రీలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం వివిధ మలయాళ చిత్ర సంస్థలు గురువారం జూన్ 1 నుండి సినిమాల షూటింగ్‌లతో పాటూ థియేటర్స్ ని మూసివేస్తూ స్ట్రైక్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

సురేష్ కుమార్ మాట్లాడుతూ జనవరి నెలలో మలయాళంలో రిలీజ్ అయిన సినిమాల కారణంగా ఈ ఒక్క నెలలోనే థియేటర్లకు మాత్రమే దాదాపుగా  రూ. 101 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపాడు. అలాగే థియేటర్స్ లో రిలీజ్ అయిన చాలా సినిమాలు కనీసం ఒకట్రెండు రోజులు కూడా ఆడటం లేదని దీంతో థియేటర్స్ యాజమాన్యంతోపాటూ నిర్మాతలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 

ALSO READ | లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరు.. థాంక్స్ చెప్పిన విశ్వక్.

కొందరు నటీనటులు మాత్రం కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని కానీ సినిమా రిలీజ్ తర్వాత ఫ్లాప్ అయితే కనీసం ప్రొడ్యూసర్స్ ని పట్టించుకోవడం లేదని అన్నారు. అలాగే 30 శాతం టాక్స్ విధించబడుతున్న పరిశ్రమ ఏదీ లేదని ఇందులో ఎంటర్టైన్ మెంట్ ట్యాక్స్ తో పాటు జీఎస్టీ కూడా ఉందని దీంతో ఈ ట్యాక్స్  ని రద్దు చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సురేష్ కుమార్ అన్నారు.

ఇక సినిమా బడ్జెట్ లో దాదాపుగా 60% శాతం నటీనటుల రెమ్యూనరేషన్స్ రూపంలో ఖర్చవుతోందని దీంతో మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాబట్టి రెమ్యూనరేషన్స్ విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇక కొత్త నటీనటులు, దర్శకులతో చేసే సినిమా చేసే సమయంలో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చెయ్యకుండా నిర్వహణ వ్యయం పెంచేస్తున్నారని దీంతో నిర్మాతలకి చుక్కలు కనిపిస్తున్నాయని వాపోయారు.