ఈ ఏడాది జనవరి 11న రిలీజైన మలయాళీ థ్రిల్లర్ అబ్రహం ఓజ్లర్ (Abraham Ozler) మూవీ నేడు (మార్చి 20న) ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీ కొన్నిసార్లు వాయిదా పడిన డిజిటల్ ప్రీమియర్ మొత్తానికి..మార్చి 20న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
క్రైమ్ జోనర్ను ఇష్టపడే వారికి ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి. అలాగే ఈ మధ్య మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ సినిమాను కూడా చూసి తీరాల్సిందే అని చాలా రోజులుగా ప్రేక్షకులు ఎదురుచూస్తూ వస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు అబ్రహం ఓజ్లర్ చూసేయండి. .
ఈ సినిమాలో మమ్ముట్టి సీరియల్ కిల్లర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కనిపించాడు. దాదాపు రూ.5కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్..బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ థియేటర్ ఆడియాన్స్ కు బాగా నచ్చేసింది. మరి ఓటీటీలో ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాలో అబ్రహం ఓజ్లర్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా హీరో జయరాం నటనకు ప్రశంసలు అందుకున్నారు.
అబ్రహం ఓజ్లర్ కథేంటి?
అబ్రహం ఓజ్లర్ (జయరాం) భార్యాపిల్లలు అనుకోకుండా మిస్సవుతారు. వారు కనిపించకుండా పోయినా..తన పక్కనే ఉన్నట్లుగా ఓజ్లర్ ఊహించుకుంటుంటాడు. వరుసగా కొందరు భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు హత్యలకు గురువుతుండడం..వారి వద్ద హ్యాపీ బర్త్ డే అంటూ రక్తంతో రాసి ఉన్న పేపర్స్ దొరుకడం..ఆ హత్యల వెనకున్న ట్విస్ట్‌ను ఓజ్లర్ అనే పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడు? అలెక్స్ (మమ్ముట్టి) సీరియల్ కిల్లర్‌గా మారడానికి వెనుకున్న కారణం ఏమిటి? సుజా అనే అమ్మాయిని ప్రేమించిన అలెక్స్ ఆమె మరణానికి కారణమైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు తెలియాలంటే అబ్రహం ఓజ్లర్ సినిమా చూడాల్సిందే. ఈ మూవీకి మిదున్ థామస్ దర్శకత్వం వహించాడు.