మలయాళ ప్రముఖ డైరెక్టర్ షఫీ గుండెపోటుతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న డైరెక్టర్ షఫీ కేరళలో ఉన్నటువంటి ఓ ప్రముఖ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో గతవారం షఫీ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో అప్పటినుంచి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. కానీ మరోసారి ఈరోజు గుండెపోతూ రావడంతో పరిస్థితి చేజారి మరణించాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ షఫీ కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో పలువురు అభిమానులు, సన్నహితులు సంతాపం తెలియజేస్తున్నారు.
ALSO READ | ఆ రూమర్స్ నమ్మకండి అంటూ RC16 టీమ్ క్లారిటీ..
ఇక డైరెక్టర్ షఫీ కెరీర్ విషయానికొస్తే 1995 లో మలయాళ స్టార్ హీరో జయరామ్ హీరోగా నటించిన ఆద్యతే కన్మణి అనే సినిమాకి దర్శకత్వం వహించి కెరీర్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలో దాదాపుగా 50కి పైగా సినిమాలకి దర్శకత్వం, స్క్రీన్ ప్లే అందించాడు. షఫీ దర్శకత్వం వహించిన పులివల్ కళ్యాణం, తొమ్మనమ్ ముక్కలుల్, కళ్యాణరామన్, టూ కంట్రీస్, చిల్డ్రన్ పార్క్, షెర్‌లాక్ టోమ్స్ తదితర సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. చివరిగా షఫీ దర్శకత్వం వహించిన ఆనందం పరమానందం సినిమా 2022లో రిలీజ్ అయ్యింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోయింది.