
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తుడరుమ్’.వెటరన్ హీరోయిన్ శోభన..ఆయనకు జోడీగా నటించారు. తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ఎం.రెంజిత్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న సినిమా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాలలో దీపా ఆర్ట్స్ పి శ్రీనివాస్ గౌడ్ గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్‌తో సాగిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో మోహన్ లాల్ ఓ మధ్య తరగతి ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించిన తీరు ఆకట్టుకుంది. ఆయన భార్య పాత్రలో శోభన నటించిన తీరు ఇంప్రెస్ చేసింది. ఓ కారు, ఫ్యామిలీ చుట్టూ ఆసక్తికరంగా నడిచిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.
మోహన్ లాల్ నేచురల్ అండ్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. మోహన్ లాల్, శోభన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంది. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఎక్సయిటింగ్‌గా ఉంది. మణియంపిల్ల రాజు, బిను పప్పు, ఇర్షాద్ అలీ, ఫర్హాన్ ఫాజిల్, థామస్ మాథ్యూ, షైజో ఆదిమాలి ఇతర పాత్రల్లో కనిపించారు.
తెలుగు ప్రేక్షకులంటే లోకువా?
ఈ మధ్య కాలంలో పరభాషా సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఇక్కడీ తెలుగు థియేటర్స్ లో మన హీరోలకి పోటీగా వస్తున్నాయి. అయినా, మన ఆడియన్స్ భాషాభేదం లేకుండా అక్కడీ హీరోలను ఆదరిస్తున్నారు. వాళ్లకి కోట్ల లాభాలు వచ్చేలా చేస్తున్నారు. కానీ, మనకు పరభాషా మేకర్స్ న్యాయం చేయట్లేదు.
అక్కడీ సినిమాలను తెలుగు ఆడియన్స్ తీసుకొచ్చే ముందు తెలుగు టైటిల్స్ పెట్టాలని కూడా ఆలోచించటం లేదు. డైరెక్ట్గా వారి భాషలోనే టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తున్నారు. దాంతో తెలుగు ప్రేక్షుకులు అంటే అంత లోకువా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులపైకి ఇలాంటి అర్థం కాని టైటిల్స్తో గతంలోనూ ఎన్నో తమిళ, మలయాళం సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి కూడా. అంతేందుకు ఇటీవలే మోహన్ లాల్ నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'ఎంపురాన్' కూడా డైరెక్ట్ తెలుగులో ఇదే టైటిల్ తో వచ్చింది.
►ALSO READ | PahalgamTerroristAttack: టూరిస్టులపై ఉగ్రదాడి పిరికిపంద చర్య.. తీవ్రంగా ఖండించిన సీనీ ప్రముఖులు..
తమిళంలో చూసుకుంటే.. ధనుష్ నటించిన రాయన్, రజినీకాంత్ వేట్టయన్, విక్రమ్ పొన్నియిన్ సెల్వన్, సూర్య రెట్రోలాంటివి కూడా టైటిల్ మార్చకుండానే వచ్చాయి. మలయాళంలో వర్షంగల్కు శేషమ్, గురువాయూర్ అంబలనడయిల్, గోలం వంటి సినిమాలు చాలానే ఉన్నాయి. బాసిల్ జోసెఫ్ నటించిన మలయాళ క్లైమ్ థ్రిల్లర్ మూవీ 'ప్రవీణ్ కూడు షాప్పు'. ఇది కూడా డైరెక్ట్ తెలుగులో ఇదే టైటిల్ తో డబ్ అయింది.
ఇక ఇప్పుడు వస్తున్న మోహన్ లాల్ ‘తుడరుమ్’కూడా ఇదే టైటిల్ తో తెలుగులోకి వస్తోంది. అసలు ఈ టైటిల్ అర్ధం ఏంటో ఎవ్వరికైనా తెలుసా? సినిమా అంటే వినోదంతో పాటు విజ్ఞానం కూడా. అలాంటప్పుడు టైటిల్ అర్ధం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ప్రేక్షకులకు ఉంది. కాబట్టి సినిమా మేకర్స్కు, తెలుగులో టైటిల్ మార్చి పెట్టె నిబంధనలు ఉండాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ‘తుడరుమ్’ అంటే తెలుగులో ‘కొనసాగుతోంది’అని అర్ధం.