మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శక నిర్మాత షఫీ (56) (Shafi )కన్నుమూశారు. ఈ నెల (జనవరి 16న) గుండెపోటుకు గురైన షఫీ.. చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు.
ఆదివారం (జనవరి 26న) అర్ధరాత్రి 12:25 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మలయాళ సినీ పరిశ్రమలో 50కి పైగా సినిమాలకు షఫీ డైరెక్టర్గా పనిచేశాడు. ఆయన తీసిన కామెడీ చిత్రాలతో ఎంతో గుర్తింపు సంపాదించారు. షఫీ మరణానికి మలయాళ పరిశ్రమ పెద్దలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
దర్శక నిర్మాత షఫీ సినిమాల విషయానికి వస్తే..
2001లో వన్ మ్యాన్ షో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వెనక్కి చూసుకోకుండా వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇందులో చాలా సినిమాలు భారీ హిట్ అయ్యాయి. కళ్యాణరామన్ (2002), పులివల్ కళ్యాణం (2003), తొమ్మనుమ్ మక్కలుమ్ (2005), మాయావి (2007), చట్టంబినాడు (2009), మరియు టూ కంట్రీస్ (2015) అతని తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ సినిమాలు. 2022లో ఆనందం పరమానందం చివరి సినిమాగా రూపొందింది.