ఆస్కార్- 2024 రేసులో మరో బిగ్గెస్ట్ హిట్ మూవీ..

ఇండియా నుండి ఆర్ఆర్ఆర్(RRR) ఆస్కార్(Oscar) సాధించిన తరువాత ఇప్పుడు చాలా సినిమాలు ఆస్కార్ అవార్డు కోసం తమ సినిమాలను పంపించాలని ఆరాట పడుతున్నాయి.  సినిమాలో కంటెంట్ ఉంటే అది ఏ సినిమా అయినా? ఏ భాష సినిమా అయినా ఆస్కార్ గెలిచే సత్తా ఉంటుంది. అందుకే చాలా మంది మేకర్స్ ఆ దారిలో అడుగులు వేస్తున్నారు

లేటెస్ట్ గా..మలయాళ స్టార్ హీరో టోవినో థామస్(Tovino Thomas)  ప్రధాన పాత్రలో వచ్చిన 2018 మూవీ మే 5న విడుదలై మాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2018లో కేరళలో వరదలు బీబత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే కాన్సెప్ట్ తో దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్(Jude Anthany Joseph)  ఒక అద్భుతమైన కథని ప్రేక్షకులకు చూపించాడు. కేరళ ప్రేక్షకులు ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. ఈ మూవీ ఆస్కార్- 2024 కు భారత్ నుంచి మలయాళం మూవీగా వెళ్లనుందని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ మూవీ మళయాళంతో పాటుగా ఇతర భాషల్లో విడుదల అయ్యి..విశేష ప్రేక్షకాదరణ పొందింది. 

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 160 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు వచ్చిన రెపాన్స్ చూసి ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తెలుగులో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

ఇక రీసెంట్గా షారుఖ్(Shah rukh khan) హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ జవాన్(Jawan) సినిమాను కూడా ఆస్కార్ కు పంపిస్తామని ఆ చిత్ర దర్శకుడు అట్లీ ప్రకటించారు. ఇక తాజాగా ఈ సారి ఇండియా నుండి ఆస్కార్ కు వెళుతున్న సినిమాల లిస్టులో మరో రెండు తెలుగు సినిమాలు  చేరాయి. అందులో జబర్దస్త్ వేణు తెరకెక్కించిన బలగం సినిమా కాగా.. రెండవది శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన దసరా మూవీ. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్నాయి.

ముందుగా బలగం సినిమా విషయానికి వస్తే.. ఇది పక్కా కుటుంబ నేపథ్యం కథాంశంతో వచ్చిన మూవీ. ఈ సినిమా ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. మానవ సంబంధాలని చాలా చక్కగా, ఎంతో భావోద్వేగంగా చూపించారు. సినిమా చివర్లో మన మన బంధువులే మన బలగం అని, ఎన్ని గొడవలు వచ్చినా కలిసే ఉండాలనే మంచి సందేశాన్ని ఇచ్చింది ఈ సినిమా. అందుకే ఈ సినిమాను ఆస్కార్ కు పంపాలని నిర్ణయించారు మేకర్స్. 

ఇక దసరా సినిమా కూడా ప్రేమ, స్నేహం అనే రెండు ఎమోషనల్ కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ సినిమా కూడా ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించింది. సినిమాలో ఆర్టిస్టుల నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అందు కే సినిమా కూడా వంద కోట్ల వసూళ్లు రాబట్టి భారీ విజయాన్ని సాధించింది. 

మరి ఈ  సినిమాలు కూడా దేనికదే ప్రత్యేకంగా ఆస్కార్ బరిలో దిగనున్నాయి.వీటిలో ఏ సినిమాకు అవార్డు వరిస్తుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.