OTT Malayalam Movies: ఓటీటీల్లో లేటెస్ట్ సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కడ చూడాలంటే?

మలయాళ సినిమాలు థియేటర్స్, ఓటీటీల్లో దుమ్ములేపుతున్నాయి. అక్కడీ మేకర్స్ తీసే సినిమాలకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు.

మలయాళ దర్శకులు రాసుకునే కథల్లో సహజత్వం, లొకేషన్స్, నటి నటుల పెర్ఫార్మన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. దీంతో మలయాళ భాష నుంచి సినిమా వస్తుందంటే చాలు.. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడటం షురూ చేస్తారు.

అంతేకాదు.. పర్టికులర్గా క్రైమ్, థ్రిల్లర్, ఫ్యామిలీ జోనర్ సినిమాలకు ఆడిక్ట్ అయిపోయారంటే నమ్మరు సుమా! ఇప్పుడు అలాంటి సినిమాలే ఓటీటీకి వచ్చాయి. 2025 జనవరి మొదటి రెండు వారాల్లో మలయాళం నుంచి వచ్చిన సినిమాలు ఓటీటీల్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. మరి ఆ సినిమాలేంటీ? వాటి కథేంటీ? అనే వివరాలు చూద్దాం. 

సూక్ష్మ‌ద‌ర్శిని ఓటీటీ:

ఫహద్ ఫాజిల్ వైఫ్ నజ్రియా నజీమ్ మరియు బాసిల్ జోసెఫ్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ సూక్ష్మదర్శిని( Sookshmadarshini). MC జితిన్ దర్శకత్వం వహించాడు. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. కేవ‌లం రూ.10 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.55 కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఇపుడీ ఈ మూవీ ఓటీటీ జనవరి 11, 2025 (శనివారం)న డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో అందుబాటులోకి వచ్చింది.

సూక్ష్మ‌ద‌ర్శిని కథ:

ప్రియదర్శిని (న‌జ్రియా న‌జీమ్‌) హౌజ్ వైఫ్. భ‌ర్త‌, కూతురుతో క‌లిసి సంతోషంగా ఉంటుంది. ఇరుగుపొరుగువారి విష‌యాల్లో ప్రియకు చాలా ఆసక్తి ఉంటుంది. అలా ఆమె తన చుట్టూ ఉన్న ప్రతిదాని గురించి తెలుసుకోవాలనుకుంటోంది. వారి రోజువారీ జీవితాలు, స్థానిక సంఘటనలు మొదలైన వాటి గురించి తనతో పాటు మరికొంతమంది మహిళలు వాట్సాప్ లో ఒకరికొకరు అప్‌డేట్ చేసుకుంటారు.

ALSO READ | OTT Movies: జనవరి 10న ఓటీటీకి 4 తెలుగు సినిమాలు.. IMDB లో అదిరిపోయే రేటింగ్.. డోంట్ మిస్

అలా ప్రియ ప‌క్కింట్లోకి కొత్త‌గా వ‌చ్చిన మాన్యుయేల్ (బాసిల్ జోసెఫ్‌) వింత ప్ర‌వ‌ర్త‌న ప్రియ‌లో అనుమానాల్ని రేకెత్తిస్తుంది. అంతలో మాన్యుయెల్ తల్లి అల్జీమర్స్ కారణంగా రెండుసార్లు ఇంటి నుండి క‌నిపించ‌కుండా పోతుంది. ఇంతకీ  అల్జీమర్స్ కారణంగా వెళ్లిపోయిందా ? లేదంటే తన కొడుకుని తప్పించుకుని పోయిందా? అనే కోణంలో కథనం ఆసక్తి కలిగిస్తోంది. 

దాంతో ప్రియ తనదైన కోణంలో మాన్యుయేల్ లైఫ్ గురించి ఇన్వేస్టిగేట్ చేయ‌డం స్టార్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా మాన్యుయేల్ గురించి ప్రియ‌కు ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిశాయి? ఈ క్ర‌మంలో ప్రియ ఎలా చిక్కుల్లో ప‌డింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌. 

కడకన్ మూవీ:

సజిల్ మంపాడ్ దర్శకత్వం వహించిన మలయాళ యాక్షన్ చిత్రం కడకన్. ఈ చిత్రంలో హక్కిం షా ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 3 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. గతేడాది 2024 మార్చిలో ఈ మూవీ థియేటర్స్ లో రిలీజై ఆడియెన్స్‌తో పాటు క్రిటిక్స్‌ను మెప్పించింది. ఇసుక మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వచ్చి ఆడియన్స్ కి మంచి థ్రిల్ ఇచ్చింది. 

కథేంటంటే:

నీలంబూర్ ఏరియాలో ఇసుక మాఫియా ఘోరంగా  జరుగుతోంది. అక్కడే ఉన్న గ్యాంగ్స్ లీడ‌ర్స్ మ‌ణి, సుల్ఫీ స్నేహం కాస్త శత్రుత్వంగా  మారుతుంది. ఇసుక అక్ర‌మ ర‌వాణా కార‌ణంగా ఏర్పడిన వీరి మధ్య పగ అది మరింత దూరం వెళుతోంది. ఇందులో సుల్ఫీ అనే వ్యక్తి  ల‌క్ష్మి అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ కోసం మాఫియా బిజినెస్‌కు దూరంగా వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. అనుకోకుండా సుల్ఫీ లోక‌ల్ సీఐ రంజిత్‌తో గొడ‌వ‌ప‌డ‌తాడు.

మ‌ణితో చేతులు క‌లిపిన రంజిత్ సుల్ఫీని దెబ్బ తీసేందుకు కుట్ర‌లు ప‌న్నుతాడు. సుల్ఫీని అరెస్ట్ చేయాల‌ని అనుకుంటాడు. రంజిత్‌, మ‌ణి ప్లాన్స్‌ను సుల్ఫీ ఎలా ఎదుర్కొన్నాడు? ఇసుక మాఫియా అక్ర‌మ దందాను వ‌దిలిపెడ‌తాన‌ని ప్రియురాలికి ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌:

'ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌..'(All We Imagine as Light) దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ఇది. అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో అవార్డులతో పాటుగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రమిది. అంతేకాదు..అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 2024 లో తన ఫేవరేట్ మూవీస్ లిస్ట్ లో ఒకటిగా నిలిచిన మూవీ కూడా. ఇప్పుడు ఈ మూవీ జనవరి 3 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

కని కుశ్రుతి, దివ్య ప్రభ,ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణతో పాటు వసూళ్లు కూడా సొంతం చేసుకుంది.

కథేంటంటే:

ముంబైలో రోజువారీ జీవనం కోసం కష్టపడుతున్న ముగ్గురు మహిళల కథ. ముంబయి ఓ నర్సింగ్ హోంలో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సులు, మరియు పార్వతి అనే వంటమ్మాయి కథే ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’. అయితే ఆ నర్సులిద్దరు కలిసి ఓ బీచ్ టౌన్ కు రోడ్ ట్రిప్ వెళ్తారు. ఆ తర్వాత వారిద్దరి జీవితాలు ఎలా మారాయి.. ? అన్నదే ఈ సినిమా స్టోరీ. ఇకపోతే తెలుగులో ఈ మూవీని రానా రిలీజ్ చేశారు.

పొంబలై ఒరుమై:

కోవిడ్ సమయంలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. ఒక మారుమూల గ్రామానికి బదిలీ చేయబడిన జూనియర్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ జీవితంలో జరిగే కథగా వచ్చింది. అక్కడ, అతను చేసే దర్యాప్తులో భాగంగా సహాయం కోరుతూ ఒక టేలర్ ను కలుస్తాడు. దాంతో ఆ గ్రామంలో ఉన్న ఓ మిస్టరీని ఎలా ఛేదించాడనేది సినిమా కథ. ఈ మలయాళ చిత్రంలో శ్రీశమ చంద్రన్, జితీష్ పరమేశ్వర్, శిల్పా అనిల్, విపిన్ అట్లే మరియు బబితా బషీర్ ముఖ్య పాత్రలు పోషించారు. పొంబలై ఒరుమై జనవరి 10న మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

పాని ఓటీటీ:

ఇటీవలే స్టార్ హీరో జోజు జార్జ్ (Joju George) నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘పాని’(Pani). కథ కూడా అందించాడు. అభినయ హీరోయిన్. మలయాళంలో మెప్పించిన ఈ చిత్రాన్ని ఆమ్ వర్డ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ తెలుగులో డిసెంబర్ 13న రిలీజ్ చేసింది.ఇపుడు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇస్తుంది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ మూవీ జనవరి 16 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.  తెలుగుభాషలో కూడా అందుబాటులోకి రానుంది.

2024 అక్టోబర్ 24న మలయాళ థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర రూ.60 కోట్లు వసూలు చేసి విజయం సాధించింది. జోజూ జార్జ్ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో పాటు యాక్ష‌న్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మ‌ల‌యాళంతో పాటు త‌మిళం, తెలుగు భాష‌ల్లో ప‌లు సినిమాలు చేశాడు జోజూ జార్జ్‌.