Manjummel Boys: తెలుగులోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఊపిరి బిగపట్టించే సర్వైవల్ థ్రిల్లర్

మళయాళ ఇండస్ట్రీలో రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్స్ లో మంజుమ్మెల్ బాయ్స్(Manjummel Boys) ఒకటి. సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో దర్శకుడు చిదంబరం ఎస్ పొడువల్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 22న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. శోభున్ షాహిర్​, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్, అరుణ్, దీపక్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి సూపర్ హిట్ టాక్ వచ్చింది. కేవలం రూ.5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.55 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. వాస్తవిక సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతుని పంచింది. 

2006లో తమిళనాడు కొడైకెనాల్​ గుణ గుహల్లో జరిగిన సంఘటన ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంత మంది స్నేహితులు టూర్ కోసం గుణ గుహల్లోకి వెళ్లగా.. అందులో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడు. ఆ స్నేహితుడిని  కాపాడం కోసం మిగతా వారు చేసిన ప్రయత్నాలే ఈ సినిమా. పోలీసులు సైతం చేతులెత్తినా ఈ ఘటనలో తమ స్నేహితుడిని ఎలా కాపాడుకున్నారు అనే విషయాలను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. 

Also Read :One year for Balagam: బలగం సినిమాకు సంవత్సరం.. మరొక్కసారి.. అంటూ దర్శకుడి ట్వీట్

మరి ఫైనల్ గా వారు తమ స్నేహితుడిని కాపాడారా? కాపాడటం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటి? అనే సన్నివేశాలు ఉత్కంఠను కలిగిస్తాయి. ఒక్కో సీన్, ఒక్కో షాట్ నెక్స్ట్ లెవల్లో డిజైన్ చేశారు మేకర్స్. ఎక్కడ కూడా సినిమా చూస్తున్న ఫీలింగ్ రాకుండా.. చాలా సహజంగా చూపించారు. అందుకే ఆడియన్స్ ఈ సినిమాకు ఈజీగా కనెక్ట్ అవుతారు. అందుకే మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా తెలుగు డబుడ్ వర్షన్ మార్చ్ 15న రానుంది. మరి మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.