మలయాళంలోనే కాక తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సూపర్ హిట్టయింది ‘దృశ్యం’(Drishyam). మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమా బెస్ట్ స్క్రీన్‌ప్లేకి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది.సెకెండ్ పార్ట్ కూడా అందరినీ మెప్పించింది. ఇప్పుడు మూడో పార్ట్‌కి రెడీ అవుతున్నారు మోహన్‌లాల్. రీసెంట్ గా ‘దృశ్యం 3’ లోడింగ్ అంటూ దర్శకుడు జీతూ జోసెఫ్ ప్రకటించారు. అలాగే తెలుగులో కూడా వెంకీ దృశ్యం సీరీస్ పెద్దఎత్తున సక్సెస్ అయింది. దీంతో దృశ్యం సీరీస్ ఇండియా భాషలతోనే ఆగకుండా..మరింత ముందుకు వెళ్తోంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..మలయాళంలో మొదలై..తెలుగు, హిందీల్లోనూ రీమేక్ అయిన సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ దృశ్యం..ఇప్పుడు హాలీవుడ్‌లోనూ రీమేక్ కాబోతుంది.ఇదే విషయాన్ని దృశ్యం ప్రొడక్షన్ హౌజ్ పనోరమా స్టూడియోస్ ఇవాళ (ఫిబ్రవరి 29న) అధికారికంగా వెల్లడించింది. గల్ఫ్‌స్ట్రీమ్ పిక్చర్స్, జేఓఏటీ ఫిల్మ్స్ తో కలిసి పనోరమా స్టూడియోస్ హాలీవుడ్ లో దృశ్యం రీమేక్ చేయనున్నట్లు తెలిపింది.
మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేశ్, హిందీలో అజయ్ దేవగన్ దృశ్యంలో నటించి సక్సెస్ అయ్యారు. ఇపుడు హాలీవుడ్ లో రీమేక్ కాబోయే నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. దృశ్యం స్టోరీని ఇంటర్నేషనల్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లడం సంతోషంగా ఉందని పనోరమా స్టూడియోస్ సీఎండీ కుమార్ మంగత్ పాఠక్ అన్నారు.
ALSO READ :- Sreemukhi: నాకు వయసు పెరిగిపోతోంది.. పెళ్లిపై శ్రీముఖి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రసెంట్ కొరియా, హాలీవుడ్ లలో దృశ్యం తీసిన తర్వాత..రాబోయే రోజుల్లో మరో పది దేశాల్లోనూ దృశ్యం సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు వెల్లడించారు. హాలీవుడ్ రేంజ్ లో వెళ్లబోయే దృశ్యం మేకర్స్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి మరి.
#PanoramaStudios takes the #Drishyam Franchise to #Hollywood!
— Sreedhar Pillai (@sri50) February 29, 2024
The cult franchise #Drishyam is all set to go global after garnering massive success in the India and China markets. Producers Kumar Mangat Pathak and Panorama Studios have joined hands with Gulfstream Pictures and… pic.twitter.com/7Kj2Ui1GSX