Manjummel Boys Telugu Box Office: మంజుమ్మల్ బాయ్స్ 10 డేస్ తెలుగు బాక్సాఫీస్..ఎంత వసూలు చేసిందంటే?

Manjummel Boys Telugu Box Office: మంజుమ్మల్ బాయ్స్ 10 డేస్ తెలుగు బాక్సాఫీస్..ఎంత వసూలు చేసిందంటే?

 

మలయాళంలో ఫిబ్రవరి 22న విడుదలైన మంజుమ్మల్ బాయ్స్(Manjummel Boys) సుమారు రూ.5 కోట్ల బడ్జెట్‍తో రూపొంది దాదాపు రూ.230 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డ్ స్పృష్టించింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొడువల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్,అరుణ్ కురియన్ ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు.

ఈ మూవీ తెలుగులో ఏప్రిల్ 6న థియేటర్లలోకి వచ్చింది. అంచనాలకు మించి తెలుగులోనూ బాక్సాపీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమాకు థియేటర్లో పోటీగా సినిమాలేవీ లేకపోవడంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఒక్క ఫ్యామిలీ స్టార్ తప్ప కొత్తగా ఏవీ రిలీజ్ కాలేదు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడటంతో..తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఈ మలయాళ డబ్బింగ్ మూవీని ఆదరిస్తున్నారు.

తెలుగు బాక్సాఫీస్ కలెక్షన్స్ చూసుకుంటే..10 రోజుల్లోనే రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.అంతేకాదు ఈ సినిమా మలయాళంలో గతంలో 2018 మూవీ పేరిట ఉన్న రికార్డులను బీట్ చేసింది. రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ అందుకున్న తొలి మలయాళ మూవీ కూడా ఇదే కావడం విశేషం.

మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్

ప్రస్తుతం థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతుండటంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది.అయితే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో ఇదిగో వస్తోంది..అదిగో వస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ డిస్నీ+ హాట్‍స్టార్(Disney Plus Hotstar) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది.అందుకు వచ్చే నెల (మే3న) మలయాళం, తెలుగుతో పాటు మరిన్ని డబ్బింగ్ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మంజుమ్మల్ బాయ్స్ కథ విషయానికి వస్తే..

2006లో కేరళకు చెందిన కొందరు స్నేహితుల అంతా కలిసి తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్‍లోని గుణ గుహలకు ట్రిప్ కు వెళతారు. ఆ సమయంలో ఆ గ్యాంగ్‍లోని ఓ యువకుడు అనుకోకుండా ప్రమాదంలో పడతాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో ఆ గ్రూప్‍లోని స్నేహితులకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యానేదే మంజుమెల్ బాయ్స్ లో ఆద్యంతం థ్రిల్లింగ్‍గా ఉత్కంఠభరితంగా చూపించారు మేకర్స్.