Pragya Nagra: ఆ వీడియోల్లో ఉన్నది నేను కాదు.. ప్లీజ్ నమ్మండి : లగ్గం నటి ప్రజ్ణా నగ్రా

Pragya Nagra: ఆ వీడియోల్లో ఉన్నది నేను కాదు.. ప్లీజ్ నమ్మండి : లగ్గం నటి ప్రజ్ణా నగ్రా

Pragya Nagra:  గత రెండు రోజులుగా మలయాళ యూన్ హీరోయిన్ ప్రజ్ఞ నగ్రా ప్రైవేట్ వీడియో లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు ఈనోటా, ఆనోటా పాకుతూ చివరికి ప్రజ్ఞ చెవిన పడ్డాయి. దీంతో ప్రజ్ఞ సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై స్పందించింది. 

ఇందులోభాగంగా తన ప్రయివేట్ వీడియో లీక్ అయ్యిందంటూ వైరల్ అవుతున్న వార్తలు గురించి తెలిసిన తర్వాత బాధ కలిగిందని తెలిపింది. ఇదోక చెడ్డ కల అని అనుకుంటున్నానని, అలాగే టెక్నలాజీ అనేది మనకి సహాయం చెయ్యడానికి తయారు చేసిందని కానీ దీనిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏఐ ద్వారా తన ఫోటోలు మార్ఫింగ్ చేసి స్ప్రెడ్ చేసినవారిని చూస్తే జాలేస్తుందని, ఇలాంటి సమయంలో స్ట్రాంగ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని పేర్కొంది. ఇక ఈ కష్ట సమయంలో తనకి అండగా నిలిచిన అభిమానులకి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఇలాంటి కష్టం మరెవ్వరికీ రాకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొంది.

Also Read :- తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఊరుకోనంటూ ఆర్జీవీ స్ట్రాంగ్ వార్నింగ్
 
ప్రజ్ఞ నగ్రా సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో తనకి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో కొందరు ప్రజ్ఞ నగ్రా ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ప్రజ్ఞకి ఇంస్టాలోదాదాపుగా 10 లక్షలపై చిలుకు ఫాలోవర్స్ ఉన్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రజ్ఞ తెలుగులో యంగ్ డైరెక్టర్ రమేష్ దర్శకత్వం వహించిన లగ్గం అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ హీరో సాయి రోనక్ హీరోగా నటించగా సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.