P Jayachandran Passed Away: మలయాళ ప్రముఖ దిగ్గజ సింగర్ పి. జయచంద్రన్ గురువారం సాయంత్రం కన్నుమూశాడు. కొన్నేళ్లుగా జయచంద్రన్ ప్రమాదకర క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. దీంతో గత ఏడాది జులై నెల నుంచి కేరళలోని త్రిసూర్ కి చెందిన ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకున్తున్నారు. కానీ ఈ మధ్య క్యాన్సర్ మరింతగా ముదరడంతో ఆసుపత్రిలో చేరి గురువారం సాయంత్రం మరణించారు.
ఈ విషయాన్ని జయచంద్రన్ కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు జయచంద్రన్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ సంతాపం తెలియజేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా గాయకుడు పి. జయచంద్రన్ స్వతహాగా మలయాళ సినీ పరిశ్రమకి చెందిన గాయకుడైనప్పటికీ వివిధ భాషల్లో దాదాపుగా 16వేలకి పైగా పాటలు పాడి ప్రేక్షకులని అలరించాడు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి తదితరులతో కలసి పని చేశాడు.
ఇందులో జయచంద్రన్ పాడిన వెంకటేష్ హీరోగా నటించిన సూర్యవంశం సినిమాలోని రోజావే చిన్ని రోజావే, పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాలోని హ్యాపీ హ్యాపీ బర్త్‌డేలు, నువ్వే కావాలి సినిమాలోని అనగనగనగా ఆకాశం ఉంది, తదితర పాటలు ఇప్పటికీ చాలామంది ఫెవరెట్ పాతాళ లిస్ట్ లో ఉంటాయి.
జయచంద్రన్ అవార్డులు రివార్డు విషయానికొస్తే 1986లో ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నాడు. అంతేగాకుండా ఐదుసార్లు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుతో పాటూ, మలయాళ సినిమాకు చేసిన సేవలకు గాను 2020లో జేసీ డేనియల్ అవార్డును కూడా అందుకున్నాడు. తమిళంలో రెండు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను అందుకున్నాడు.