పదేళ్ల చిన్నారి అసాధారణ ప్రతిభ.. చెస్ గేమ్‌లో గిన్నిస్ రికార్డ్

పదేళ్ల  చిన్నారి అసాధారణ ప్రతిభ.. చెస్ గేమ్‌లో గిన్నిస్ రికార్డ్

ప్రపంచమంటే ఏంటో తెలియని వయసులో ఒక చిన్నారి ఏకంగా ప్రపంచ రికార్డునే బద్దలు కొట్టింది. సాధించాలనే తపన ఉంటే ఏది కూడా అసాధ్యం కాదని నిరూపించింది. పదేళ్ల వయసులో గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కి ఔరా అనిపించింది. ఇంతకీ ఈ చిన్నారి సాధించిన ప్రతిభ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

సాధారణంగా పిల్లలు చెస్ గేమ్ మీద ఆసక్తి చూపించరు. కానీ మలేషియాకు చెందిన పదేళ్ల పునితమలర్ రాజశేఖర్ కళ్లకు గంతలు కట్టుకుని 45.72 సెకన్లలో చదరంగం బోర్డును ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచింది. దీంతో కళ్ళకు గంతలు కట్టుకొని వేగంగా చెస్ సెట్ చేసిన క్రీడాకారిణిగా నిలిచి ప్రతిష్టాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సంపాదించింది. 5 సంవత్సరాల వయసులో చెస్ ఆడడం ప్రారంభించిన ఈ చిన్నారి.. స్కూల్ లో ఎప్పుడూ బెస్ట్ ప్లేయర్ గా నిలిచేది. పునితమలర్ రాజశేఖర్ దేశవ్యాప్తంగా జరిగే చెస్ టోర్నీల్లో కూడా పాల్గొంటుంది. ఆమె నాన్నే తన కోచ్ అని.. చెప్పుకొచ్చింది.