ఇండియాలో మాల్దీవుల అధ్యక్షుడి పర్యటన

ఇండియాలో మాల్దీవుల అధ్యక్షుడి పర్యటన

ఇండియా పర్యటనలో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం( అక్టోబర్ 06) సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో మహ్మద్ మొయిజ్జుకు కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కిరిటి వరధాన్ సింగ్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆహ్వానం మేరకు అక్టోబర్ 6నుంచి 10 వరకు ఇండియాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము,ప్రధాని మోదీ, సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారు. 

ఇటీవల జరిగిన 79వ యూనైటెడ్ నేషన్స్ జనరల్ సమావేశంలో..ఇండియాతో ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు సంతోషంగా ఉందన్నారు మెయిజ్జు. త్వరలో భారత్ లో పర్యటిస్తానని అన్నారు. 
ఇటీవల మాల్దీవులు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మెయిజ్జు..తొలిసారి టర్కీ, ఆ తర్వాత చైనాలో పర్యటించారు. 

 

ALSO READ |మెరీనా బీచ్‌లో ఘనంగా ఐఏఎఫ్‌ ఎయిర్‌ షో

 

 

అయితే గతంలో ఏ మాల్దీవుల అధ్యక్షుడు అయినా పదవి చేపట్టిన తర్వాత ఇండియాలో పర్యటించేవారు. దీనికి విరుద్ధంగా మొయిజ్జు టర్కీ, చైనా పర్యటన భారత్, మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపాయి. అధ్యక్ష  హోదాలో భారత్ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు మొయిజ్జు. మాల్దీవుల్లో ఉన్న ఇండియన్ ట్రూప్ లను వెనక్కి పంపించారు. 

అయితే తర్వాత భారత్ నుంచి వత్తిడి పెరగడంతో మొయిజ్జు స్వరం మార్చారు. భారత్ తో సత్సంబంధాలు నడిపేందుకు చేతులు చాచారు. ఇండియా చేస్తున్న ఆర్థిక సాయానికి కృతజ్ణతలు తెలిపారు. ద్రౌపతి ముర్ము ఆహ్వానం మేరకు ఇండియాలో పర్యటిస్తున్నారు.