మాల్దీవులకు భారత్ ఆర్థిక సాయం.. సముద్ర భద్రత, వాణిజ్య ఒప్పందంపై చర్చలు

మాల్దీవులకు భారత్ ఆర్థిక సాయం.. సముద్ర భద్రత, వాణిజ్య ఒప్పందంపై చర్చలు

ఐదు రోజు భారత్ పర్యటనలో భాగంగా మాల్దీవ్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ సోమవారం (అక్టోబర్ 7)న ఇండియాలకు వచ్చారు. ఈక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీ ఆయన్ను స్వాగతించారు.  అనంతరం మొదటిరోజు ఇరు దేశాల అధినేతలు పలు విషయాలపై చర్చించుకున్నారు. మాల్దీవ్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండంగా ఇండియా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా మాల్దీవుల సంక్షోభ సమయంలో భారత్‌ ఎప్పుడూ ముందుంటుందని ప్రధాని మోదీ తెలిపారు. మాల్దీవులకు రూ.30 బిలియన్స్ ఇండియన్ కరెన్సీ ఆర్థిక సాయంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. 

ALSO READ | రాజకీయం చేయకండి.. ఓవర్ హీట్ కారణంగా చనిపోయారు : మంత్రి మా సుబ్రమణియన్

ఇరు దేశాల మధ్య హైదరాబాద్ హౌస్‌లో సముద్ర భద్రత, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై  ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈరోజు జరిగిన సమావేశంలో భారతదేశ 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానం, సాగర్ విజన్‌లో మాల్దీవుల కీలక పాత్రను ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించారు.

భారత్, మాల్దీవుల సంబంధాలు శతాబ్దాల నాటివని, ఇండియా మాల్దీవులకు సన్నిహిత మిత్ర దేశమని ప్రధాని మోదీ అన్నారు. మా నైబర్ హుడ్ విధానం, సాగర్ దృష్టిలో మాల్దీవులు ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉందని.. ఇండియా ఫస్ట్ ప్రిఫెరెన్స్ ఎప్పుడు మాల్దీవులకే అని ఆయన అన్నారు. 400 మిలియన్ యుఎస్ డాలర్ల ద్వైపాక్షిక కరెన్సీ స్వాప్ ఒప్పందానికి అదనంగా 30 బిలియన్ ఇండియన్ కరెన్సీ ఇచ్చినందుకు ముయిజ్జూ కృతజ్ఞతలు తెలిపారు.