మీ సైన్యాన్ని మీరు తీసుకెళ్లండి : మాల్దీవ్ అధ్యక్షుడు

భారత్, మాల్దీవుల మధ్య రాజుకున్న చిచ్చు రోజు రోజుకూ పెద్దదవుతోంది. ప్రస్తుత మాల్దీవ్ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తుందటమే ఇందుకు కారణం. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి సంవత్సరం తొలి పార్లమెంట్ సమావేశంలో అధ్యక్షుడు ప్రసంగించాలి. ఈ నేపథ్యంలో సోమవారం (ఈరోజు) మయిజ్జూ పార్లమెంట్ సెషన్ లో మాట్లాడారు. ఆ దేశంలో ఉన్న 80మంది ఇండియాన్ ఆర్మీ 60 రోజుల్లోగా తిరిగి భారత్ కు వెళ్లిపోవాలని గతంలో ఆయన అన్నారు. అయితే ఈ రోజు సమావేశంలో మయిజ్జూ మళ్లీ అదే మాట చెప్పుకొచ్చారు. ఇండియాకు తిరిగి వెళ్లేందుకు భారత సైన్యానికి ఇన్న డెడ్ లైన్ ను గుర్తు చేశారు.

ఆ దేశంలో ప్రధాన ప్రతి పక్ష పార్టీలైన  మాల్దీవియన్‌ డెమొక్రటిక్స్‌ పార్టీ (MDP), ది డెమొక్రటిక్స్ అధ్యక్షుడి ప్రసంగాన్ని బహిష్కరించాయి. ఇందుకు కారణాలు మాత్రం ఆయా పార్టీలు వెల్లడించలేదు. మహ్మద్ ముయిజ్జూపై ఇటీవల మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ, డెమొక్రాట్స్ పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. మయిజ్జూ అవలంభిస్తున్న భారత వ్యతిరేఖ వైఖరిని ఖండిస్తూ ఆ పార్టీ నేతలు కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.