
- బాచుపల్లి ఎస్ఎల్జీ హాస్పిటల్లో ఘటన
జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లి ఎస్ఎల్జీ హాస్పిటల్లోమేల్ నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన మేహరాజ్(25) బాచుపల్లిలోని ఎస్ఎల్జీ హస్పిటల్లో గత నాలుగేండ్లుగా నర్సుగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడాడు. శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి ఎక్కువ మోతాదులో మత్తు ఇంజక్షన్ తీసుకున్నాడు.
తోటి సిబ్బంది గమనించి ట్రీట్మెంట్ కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాగా, హాస్పిటల్ యాజమాన్యం ఆరు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని తోటి ఉద్యోగులు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మేహరాజ్ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఆత్మహత్య చేసుకున్న తరువాత కూడా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.