రాజకీయాల్లోనూ మహిళలకు వెక్కిరింపులేనా?

రాజకీయాల్లో ఉన్న ఆడవారి విషయంలో మగపొలిటీషియన్లు చేసే కామెంట్లు మధ్య కాలంలో హద్దుమీరుతున్నాయి. వివాదాస్పదమవుతున్నాయి. పాలిటిక్స్ లోఉండే మహిళల పట్ల మగవారు చులకనతో వ్యవహరించడంకొత్త విషయం కాదు. నీచ సంస్కృతి మొదటినుం చీఉన్నదే. ఆడవారు రాజకీయాల్లో రాణించలేరని చాలామందిమగ పొలిటీషియన్లు డిసైడ్ అయి ఉండటమే దీనికి కారణం.పాలిటిక్స్ పై పేటెంట్ హక్కు తమకే ఉందని మెజారిటీ మగపొలిటీషియన్లు భావిస్తుంటారన్నది సైకాలజిస్టుల  అభిప్రాయం.

ఇందిరా గాంధీ నుంచి జయప్రద వరకు అందరూ మగవాళ్ల చిన్నచూపు ఎదుర్కొన్నవారే. మగ పొలిటీషియన్ల పనికిమాలిన విమర్శలకు బలైనవారే. యూపీలోని రాం పూర్నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పోటీ చేస్తున్న జయప్రదపై ఆమె ప్రత్యర్థి, సమాజ్ వాది పార్టీ ప్రముఖుడు ఆజంఖాన్ చేసిన కామెంట్లను కూడా ఈ కోణంలో నుంచే చూడాలి.

గుంగీ గుడియాగా ఇందిరకు వెక్కిరింపు

ఇందిరా గాంధీ ప్రధాని అయిన కొత్తల్లో రాజకీయ ప్రత్యర్థులు ఆమెను బాగా చిన్నచూపు చూసేవారు.‘గుంగీ గుడియా’ అంటూ వెక్కిరిం చేవారు. ‘‘మాట్లాడ్డమే రాని ఈ బొమ్మ, ప్రధానిగా బాధ్యతలుఎలా నిర్వహిస్తుంది?’ అని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవారు. అయితే, కొద్దికాలంలోనే తానుగుంగీ గుడియా కానని ఇందిర రుజువు చేసుకున్నారు . 1971 నాటి బంగ్లాదేశ్ యుద్ధంతో ప్రజల దృష్టిలో ఇందిర గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ‘గుంగీగుడియా’ కాస్తా ‘దుర్గా దేవి’గా మారిపోయారు.అప్పటి నుంచి రాజకీయంగా ఇందిర వెనక్కితిరిగిచూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు.2014లో బాలీవుడ్ నటి హేమమాలిని తొలిసారి యూపీలోని మథుర సెగ్మెంట్ నుంచి లోక్ సభ బరిలోదిగినప్పుడు కూడా ఇలాం టి కామెంట్లే ఎదుర్కొన్నారు. అప్పట్లో సమాజ్ వాది పార్టీలో యాక్టివ్ గా ఉన్నఅమర్ సిం గ్ ఆమెను కిం చపరిచేలా కామెంట్లుచేశారు. “హేమమాలిని చూడ్డానికి బావుంటుం ది.అంతే. ఎవరూ ఆమెకు ఓటు వేయరు” అంటూకామెంట్‌ చేసి వివాదాల పాలయ్యారు.

మగవాళ్ల మైండ్ సెట్ మారడం లేదు

ఆడ పొలిటీషియన్ల పట్ల మగ రాజకీయవేత్తలు చేసే కామెంట్లు ఈమధ్య కాలంలో హద్దు మీరుతున్నాయి.మగవాళ్లలో దాగిన దురహంకారమే దీనికి ప్రధానకారణమంటున్నారు సైకాలజిస్టులు. రాజకీయాలు అంటే అదేదో బ్రహ్మ పదార్థమని, మహిళలకు అర్థం కావని మగవారు ఆల్ రెడీ ఫిక్స్ అయిపోతుంటారు .ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్ని కబుర్లు చెప్పినా ,మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్​లో ఇప్పటికీ ఆడవారి ప్రాతినిధ్యం తక్కువే. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం మరింతగా పెరగాలి. అప్పుడే వారిపై గల చులకనభావం తగ్గుతుందని సామాజిక వేత్తలు అంటున్నారు .

 ప్రియాంకనూ వదలని విమర్శలు

సినీ రంగం నుంచి వచ్చినవారి పట్ల మాత్రమే ఇలాం టి చిన్నచూపు ఉంటుందనుకుంటే అదిపొరపాటే. ఇందిరా గాంధీ కుటుంబానికి చెందిన ఆడ పొలిటీషియన్లకు కూడా మినహాయింపు దొరకలేదు. కొన్ని నెలల కిందట ప్రియాంకా గాంధీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమితులైనప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ‘ప్రియాం క అందమైన బొమ్మ మాత్రమే. ఆమెకు రాజకీయంగా ఎలాంటిసత్తా లేద’ని బీహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝూకామెం ట్స్ చేశారు. ‘కాం గ్రెస్ లో మంచి లీడర్లు లేకపోవడం వల్లనే, చాక్ ట్ ఫేస్ ప్రియాంకను తెరమీదకు తీసుకు వచ్చార’ని బీజేపీ నాయకుడు కైలాశ్విజయ్ వర్గీయ వ్యాఖ్యానించారు .

సీనియర్లయినా చులకనే

మహిళలు ఎంత సీనియర్ పొలిటీషియన్లయినామగవారు తగిన గౌరవం ఇవ్వని సంఘటనలు ఎన్నోఉన్నాయి. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కూడా ఈ పనికిమాలిన విమర్శల నుంచి తప్పించుకోలేకపోయారు. సీనియారిటీని కూడా పట్టించుకోకుం డా పార్లమెంటు సాక్షిగా రేణుకను ‘శూర్పణఖ’తో పోల్చి ఆనందించారు .  బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిపై కొన్ని నెలల కిందట కేంద్ర మంత్రి అశ్వినిచౌబే చేసిన వ్యాఖ్యలు కూడా అలాంటివే. ‘రబ్రీ దేవిమా వదిన లాంటిది. ఆమెకు వ్యతిరేకంగా మేం మాట్లాడలేం . మహిళ కాబట్టి ఆమె నెత్తిపై ముసుగేసుకుని మౌనంగా ఉంటేనే మంచిది’ అంటూ చౌబేకామెంట్‌  చేశారు. ఆడవారికి రాజకీయాల గురించి మాట్లాడే హక్కులేదని పరోక్షంగా మనసులోని మాట బయటపెట్టారు అశ్విని చౌబే.

’ నాచ్ నేవాలీ’ అంటూ జయా బచ్చన్ పై విమర్శలు

కొన్నేళ్ల కిందట సినీ నటి జయాబచ్చన్ కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. సమాజ్ ది పార్టీ తరఫున రాజ్యసభ సీటును ఆశించి భంగపడ్డ నరేష్ అగర్వాల్ తర్వాత బీజేపీలో చేరారు. ఆ సందర్భంగా తనను కాదని, సినీ నటి జయాబచ్చన్ కి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారన్న ఆక్రోశంతో తీవ్రమైన కామెంట్లు చేశారు. ‘నాచ్ నేవాలీ (నటి)’ అంటూ జయా బచ్చన్ మండిపడ్డాడు. ఈ కామెంట్లపై సమాజ్ ది పార్టీ లీడర్లు ఎవరూ రియాక్ట్‌ కాకపోయినప్పటికీ బీజేపీ మహిళా నేతలు మాత్రం స్పందించారు. సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ వంటివారు నరేష్ అగర్వాల్ మాట తీరును ఎండగట్టారు.