టీచర్ ​ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హిస్టరీ : బండి సంజయ్​

టీచర్ ​ఎమ్మెల్సీ ఎన్నికల్లో  బీజేపీ హిస్టరీ : బండి సంజయ్​
  • మల్క కొమరయ్యది చారిత్రక విజయం
  • కరీంనగర్‌‌‌‌లో కమలం పార్టీ విజయోత్సవ ర్యాలీ 

కరీంనగర్ సిటీ, వెలుగు:  కరీంనగర్, నిజామాబాద్, మెదక్ , ఆదిలాబాద్ టీచర్​ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యది చారిత్రక విజయమని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్​లో  బీజేపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయం నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బండి సంజయ్​ మాట్లాడుతూ.. మల్క కొమరయ్య  విజయంలో ‘తపస్’  ప్రధాన భూమిక పోషించిందని చెప్పారు.

 తపస్ నాయకత్వం ఈ ఎన్నికల్లో  కష్టపడిన తీరు, దూకుడు  చూసి ప్రస్తుతం ఉపాధ్యాయ సంఘాల్లో అలజడి మొదలైందని, ఎంతోమంది ఉపాధ్యాయులు ‘తపస్’వైపు చూస్తున్నారన్నారు. ప్రధాని మోదీ పాలనపై నమ్మకం ఉంచి ఉపాధ్యాయులు కొమరయ్యకు ఓట్లు వేశారని అన్నారు. ఈ వ్యతిరేకతను గ్రహించి అయినా..  ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన ప్రమోషన్లు, బెనిఫిట్స్​ను తప్పకుండా ఇవ్వాలన్నారు. బీజేపీ శకం ఆరంభమైందని, కిషన్ రెడ్డి నాయకత్వంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో  సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.