టీచర్ల సమస్యలపై పోరాటం కొనసాగిస్త : మల్క కొమరయ్య

టీచర్ల సమస్యలపై  పోరాటం కొనసాగిస్త : మల్క కొమరయ్య
  • నా విజయం టీచర్లకు అంకితం
  • బీజేపీ స్టేట్​ ఆఫీసులో సంబురాలు 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో టీచర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఆ సమస్యల పరిష్కారానికి పోరాటం కొనసాగిస్తానని కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన మల్క కొమరయ్య అన్నారు. మంగళవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చారు. బీజేపీ నేతలు కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి.. సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ను ఎంపీ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తదితరులు సన్మానించారు. 

తర్వాత మల్క మాట్లాడుతూ.. తన విజయం టీచర్లకు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. బీజేపీ బలం, టీచర్ల మద్దతుతోనే ఈ గెలుపు సాధ్యమైందని వివరించారు. అన్ని సంఘాల టీచర్ల మద్దతుతోనే రికార్డు మెజార్టీతో విజయం సాధించినట్టు తెలిపారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. రేవంత్ సర్కారు పతనానికి మల్క కొమరయ్య గెలుపు నాంది అని అన్నారు. జీవో 317పై అలుపెరుగని పోరాటం చేసిన ఘనత బీజేపీది అన్నారు.