లింగమంతులస్వామి ఆలయ అభివృద్ధికి కృషి : ఎంపీ ఈటల రాజేందర్

 లింగమంతులస్వామి ఆలయ అభివృద్ధికి కృషి  : ఎంపీ ఈటల రాజేందర్

సూర్యాపేట, వెలుగు : బీజేపీ అధికారంలోకి వస్తే లింగమంతులస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం దురాజ్ పల్లి లింగమంతులస్వామి జాతరకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ లింగమతులస్వామి జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటున్నారని, అందరినీ చల్లగా చూడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. 

స్వామివారి కృపతో రానున్న కాలంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ జిల్లా అద్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, ఓయూ జేఏసీ నాయకులు ఉన్నారు.