మహిళలు, విద్యార్థులకు సైకిల్ పెట్రోలింగ్  రక్ష

ఉప్పల్,వెలుగు: మహిళలకు, విద్యార్థులకు పోలీసుల సైకిల్ పెట్రోలింగ్ ఎంతో రక్షణగా ఉంటుందని మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి పేర్కొన్నారు. ఉప్పల్ పీఎస్ పరిధిలోని చిలుకానగర్, కుమ్మరి బస్తీ తదితర ప్రాంతాల్లో ఏసీపీతో పాటు సీఐ ఎలక్షన్ రెడ్డి  బుధవారం సైకిల్ పెట్రోలింగ్ చేశారు. విద్యార్థులకు, ప్రయాణికులకు డ్రగ్స్, చైన్ స్నాచింగ్ లు వంట్రి నేరాలపై ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.  సైకిల్ పెట్రోలింగ్ తో ప్రజల వద్దకు పోలీసులు వెళితే.. నేరాలను తగ్గుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఏసీపీ తెలిపారు.