- మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
- కొడుకుతో కలిసి ఎన్నికల ప్రచారం షురూ
నిజాంపేట, వెలుగు: బీఆర్‌ఎస్‌ది కమీషన్ల ప్రభుత్వమని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. సోమవారం మండలంలోని రాంపూర్‌లో మెదక్ కాంగ్రెస్అభ్యర్థి రోహిత్ రావుతో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వానివి అన్నీ బూటకాపు పథకాలే అన్నారు. ఆ పార్టీని ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
ఇతర పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో తిరగకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామనుకుంటున్న బీఆర్‌ఎస్‌ది భ్రమేనన్నారు. రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు సాధించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ వారిచ్చే పైసలు తీసుకుని ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహేందర్, టీపీసీసీ కార్యదర్శి సుప్రభాత రావు, రమేశ్‌రెడ్డి, నరేందర్, మహేశ్, శ్రీకాంత్, రాజయ్య, వినోద్, బాబు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
పాపన్నపేట: మండల కేంద్రంలో అనారోగ్యంతో మృతి చెందిన చాకలి బాలకృష్ణయ్య కుటుంబ సభ్యులకు మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రూ. 5000 ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, కలీం, నరేందర్ గౌడ్, ప్రభు ఉన్నారు