తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రకటించారు. సెప్టెంబర్ 27న ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు మైనంపల్లి వెల్లడించారు. సోమవారం దూలపల్లి లోని మైనంపల్లి నివాసంలో కాంగ్రెస్ నేతలు మాజి డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ,మాజి ఎంపి అంజన్ కుమార్ యాదవ్ లతో జరిగిన సమావేశం అనంతరం మైనంపల్లి ఈ ప్రటకన చేశారు.
Also Read : ఇండియాను ఎలా వదులుకుంటాం : కెనడా రక్షణ శాఖ మంత్రి
శుక్రవారం ( సెప్టెంబర్ 23న) బీఆర్ ఎస్ పార్టీకి మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. బీఆర్ ఎస్ లో ప్రజాస్వామ్యం లేదని.. ఇదేంటని ప్రశ్నించిన నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు మైనంపల్లి.
నియోజక వర్గంలో చేసిన సర్వే ఆధారంగా తనకు, తన కుమారుడికి కూడా అవకాశం ఇస్తారని భావిస్తున్నామన్నారు మైనంపల్లి. తనకు పదవులు ముఖ్యం కాదని,కార్యకర్తల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనకాడననీ అన్నారు.
మేడ్చల్,మల్కాజిగిరి,మెదక్ సీట్లు ఆశిస్తున్నట్లు తెలిపారు మైనంపల్లి. మేడ్చల్ ఎమ్మెల్యే సీటు నక్క ప్రభాకర్ గౌడ్కు ఇవ్వాలని..ఎన్ని అవాంతరాలు సృష్టించిన కాంగ్రెస్ పార్టీలో చేరుతానని నమ్ముకున్న నియోజక వర్గం ప్రజల కోసం కష్టపడతనని తెలిపారు మైనంపల్లి.