మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెంపచెళ్లు మనిపించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న బాధితులు, అనుచరులు దాడి చేశారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఘట్కేసర్ మండలం కొర్రములలో చోటు చేసుకుంది.
కొంత కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఎలకశిలా నగర్ అసోసియేషన్ వారికి మధ్య భూ తగాదా నడుస్తోంది. ఇవాళ ఉదయం అసోసియేషన్ వారికి మద్దతు తెలిపేందుకు ఎంపీ ఈటల రాజేందర్ అక్కడికి చేరుకున్నారు. ప్లాట్లు పరిశీలిస్తుండగా అపోజిషన్ వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు.
ఈ క్రమంలో మాటా మాటా పెరగడంతో ఈటల రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయిచేసుకున్నాడు. దీంతో ప్లాట్ ఓనర్స్ కూడా దాడి చేశారు. ఈ క్రమంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వివాదం కోర్టు పరిధిలో ఉందని, ఎలాంటి అనుమతి లేకుండా ప్రాపర్టీలోకి ప్రవేశించడంతోపాటు, తమపై దాడి చేశారని ఆరోపిస్తూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం.