![బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు : ఈటల రాజేందర్](https://static.v6velugu.com/uploads/2025/02/malkajgiri-mp-etala-rajender-clarifies-bjps-stance-on-bc-caste-census_wj7WBb0Xrh.jpg)
- మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
యాదగిరిగుట్ట, వెలుగు : బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని మల్కాజ్గిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే పార్లమెంట్ లో ఆమోదించడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కులగణన సర్వే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చట్టబద్ధమైన సంస్థలతో సర్వే చేయించి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూర్ అశోక్ గౌడ్, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, జిల్లా కార్యదర్శి అచ్చయ్య, యాదగిరిగుట్ట పట్టణ కర్రె ప్రవీణ్, మండల అధ్యక్షురాలు మహేశ్వరి సత్యనారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.