డాన్ అవ్వాలనే ఆశతో ఇల్లీగల్ ​గన్స్ ​బిజినెస్

డాన్ అవ్వాలనే ఆశతో ఇల్లీగల్ ​గన్స్ ​బిజినెస్

హైదరాబాద్, వెలుగు: ఎప్పటికైనా మోస్ట్​వాంటెడ్​డాన్​గా మారాలనే ఆశతో కంట్రీమేడ్ రివాల్వర్స్ విక్రయిస్తూ ఓ యువకుడు మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులకు చిక్కాడు. అతని నుంచి 4 ఎయిర్ పిస్టల్స్, రివాల్వర్, ఓ పిస్టల్, కంట్రీమేడ్ రివాల్వర్, 11 లైవ్‌ రౌండ్‌ బుల్లెట్స్‌ స్వాధీనం చేసున్నారు. మహారాష్ట్ర నుంచి తుపాకులు తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు వివరాలను వెల్లడించారు.

కాకినాడకు చెందిన బొల్లింకల సాయిరాంరెడ్డి(23) బీకాం చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. సిటీకొచ్చి ఈజీ మనీ కోసం ఉప్పల్​చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు. చర్లపల్లి జైలులో ముంబైకి చెందిన క్రిమినల్స్‌తో జతకట్టి ఎలాగైనా పెద్ద డాన్​గా ఎదగాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల బయటికి వచ్చి గన్స్​బిజినెస్​చేయాలని ముంబై పోయాడు. కంట్రీ మేడ్​గన్స్​తెచ్చి నేరేడ్‌మెట్‌ లో అమ్మకానికి యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు.