రోడ్లపై నీరు నిల్వకుండా చూడాలి... మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్

రోడ్లపై నీరు నిల్వకుండా చూడాలి... మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: రోడ్లపై నీరు నిల్వకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాల్ లో రోడ్లు, ట్రాఫిక్, మున్సిపాలిటీ, ఆర్అండ్ బీ,  ఎన్ హెచ్ అధికారులతో బుధవారం ఆయన సమీక్షా  సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.

రహదారుల వెంట వీధి దీపాలను ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, మల్కాజిగిరి  ఏసీపీ  శ్రీనివాసరావు, ట్రాఫిక్ రాచకొండ ఇన్స్పెక్టర్  ప్రదీప్ బాలు, ఎన్ హెచ్ 44 పీడీ ఎల్ఎస్ రావు, ఆర్అండ్ బీడీ ఈఈ సరిత, ఏఈఈ శ్రీనివాసమూర్తి,  మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.