సిరిసిల్ల టౌన్, వెలుగు : మల్కపేట రిజర్వాయర్‌కు మాజీ ఎమ్మెల్యే కర్రోళ్ల నర్సయ్య పేరు పెట్టాలని అఖిలపక్ష పార్టీలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల బస్టాండ్ ఏరియాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ దళిత కుటుంబంలో పుట్టిన నర్సయ్య నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడారని..
ఆ యోధుడి పేరును మల్కపేట రిజర్వాయర్‌కు పెట్టాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల లీడర్లు అంకని భాను, వేణు, రమేశ్, రామచంద్రం, మల్లేశ్, నాగరాజు పాల్గొన్నారు.