కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన మల్కాజ్ గిరి బీఆర్ఎస్ అభ్యర్థి

కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన మల్కాజ్ గిరి బీఆర్ఎస్ అభ్యర్థి

మేడ్చల్ జిల్లా : లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ బోణి కొట్టలే. ఎగ్జిట్ పోల్ చెప్పినట్లే తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటి కొనసాగుతుంది. మల్కాజ్ గిరి  పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ సెంటర్ నుంచి బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి వెళ్లిపోయారు. దాదాపు లక్ష ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర ముందున్నారు. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంట్ స్థానంగా మల్కాజ్ గిరి సీటుకు పేరుంది. 

ప్రజల తీర్పును స్వాగతిస్తున్నా అని లక్ష్మారెడ్డి మీడియాతో అన్నారు. ఇంకా ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాలే కానీ, ఈటల విజయం దాదాపు ఖరారైనట్టే అని ఆ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ వారు ఏమైనా బిజెపి కి ఓటు వేశారా అని ఆయనను అడిగగా.. లేదు మా పార్టీ వారు మాకే ఓటు వేశారని సమాధానం ఇచ్చారు. పూర్తిగా ఇంకా ఎన్నికల కౌంటింగ్ కాలేదు కానీ బిజెపి ముందంజలో ఉంది అని అన్నారు. మా పార్టీ నాయకుడు సూచన మేరకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని అన్నారు.