కలలోకి వస్తున్నవు.. కిస్​ మీ..ఎంబీఏ స్టూడెంట్​కు మల్లారెడ్డి కాలేజీ లెక్చరర్ గలీజ్ మెసేజ్​లు

కలలోకి  వస్తున్నవు.. కిస్​ మీ..ఎంబీఏ స్టూడెంట్​కు మల్లారెడ్డి కాలేజీ లెక్చరర్ గలీజ్ మెసేజ్​లు
  • ఎంబీఏ స్టూడెంట్​కు లెక్చరర్ గలీజ్ మెసేజ్​లు
  • మల్లారెడ్డి కాలేజీ లెక్చరర్​పై కేసు

జీడిమెట్ల, వెలుగు : ఎంబీఏ స్టూడెంట్​కు గలీజ్​గా మెసేజ్​లు పంపుతూ లైంగిక వేధిస్తున్న మల్లారెడ్డి కాలేజీ లెక్చరర్​పై పేట్​బషీరాబాద్ పీఎస్​లో కేసు నమోదైంది. ఈ నెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి (21) మైసమ్మ గూడలోని మల్లారెడ్డి కాలేజీలో ఎంబీఏ చేస్తూ హాస్టల్లో ఉంటోంది. కాలేజీకి చెందిన లెక్చరర్ టి.స్వామి ఆమెకు అసభ్యకరంగా మెసేజ్​లు పంపుతూ లైంగికంగా వేధిస్తున్నాడు. 

దీంతో ఆ విద్యార్థిని కాలేజీ మేనేజ్​మెంట్​కు ఫిర్యాదు చేసినప్పటికీ సరిగా స్పందించలేదు. తాము ఎంక్వైరీ కమిటీ వేశామని, లెక్చరర్​స్వామిని డిస్మిస్​చేశామని చెప్పుకొచ్చారు తప్పితే డిస్మిస్​చేసిన పేపర్లు మాత్రం బయటకు చూపలేదు. అలాగే స్వామి ఫోన్​ స్విచ్చాఫ్ ఉందని, ఇంటివద్ద లేడన్నారు. దీంతో కాలేజ్​మేనేజ్ మెంట్​సైతం స్వామికి సపోర్ట్​చేస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలి పేట్​బషీరాబాద్ పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.