హైదరాబాద్ -బీజాపూర్ రోడ్డు విస్తరణ చేపట్టాలి : శివస్వామి మల్లారెడ్డి

హైదరాబాద్ -బీజాపూర్ రోడ్డు విస్తరణ చేపట్టాలి :  శివస్వామి మల్లారెడ్డి

చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్– -బీజాపూర్ రహదారి విస్తరణను వెంటనే చేపట్టాలని చేవెళ్ల మండలం షాబాద్ చౌరస్తాలో సామాజిక కార్యకర్త, శివస్వామి మల్లారెడ్డి చేపట్టిన రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. బుధవారం ఆయనకు పలువురు సంఘీభావం తెలిపారు. 

రోడ్డు విస్తరణ జరగకపోవడంతో నిత్యం అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్​చేశారు.