అప్పటి నుంచే రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు

అప్పటి నుంచే రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు

మంత్రి మల్లారెడ్డి...పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ మల్కాజ్‌గిరి సీటు రేవంత్‌కు కాకుండా తనకు కేటాయించినందుకు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారన్నారు. బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని అప్పుడే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రేవంత్‌ రెడ్డి తనను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని మల్లారెడ్డి తెలిపారు.

2012లో మెడికల్ కాలేజీని ప్రారంభించినట్లు మల్లారెడ్డి చెప్పారు. జవహర్ నగర్ లో ఉన్నదంతా ప్రభుత్వానిదే.. పేదలు చాలా మంది ఇండ్లు కట్టుకున్నారన్నారు. అక్కడ నా కోడలు పేరుతో 350 గజాలు వుందని. మున్సిపాలిటీ లో NOC తీసుకున్నట్లు తెలిపారు. దేశం లో గర్ల్స్ కోసం మెడికల్ కాలేజీ పెట్టింది తానేనన్నారు. వసతి గృహాల్లో దాదాపు 7వేల మంది అమ్మాయిలు ఉంటున్నారన్నారు. ఏది జిరాక్స్ పేపర్లు తెచ్చి ఏదో చెప్తే సరిపోతదా అని ప్రశ్నించారు. దొంగ పత్రాలు చూపెట్టి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పర్మిషన్లతోనే ఆస్పత్రిని నిర్మించినట్లు మంత్రి స్పష్టం చేశారు. తన సంస్థలను ఉన్నతంగా నడుపుతున్నట్లు వివరించారు. తాను ఎంపీగా రూ.200 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎంపీ అయ్యాక కూడా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆక్షేపించారు. పార్లమెంటులో కూడా మల్లారెడ్డి విద్యా సంస్థల గురించి ప్రశ్నలు వేశారని.. తన విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పిందన్నారు.

దివాలా తీసిన పార్టీకి నువ్వు ప్రెసిడెంట్ వని..ఎవడు దిక్కు లేక నీకు ఇచ్చారన్నారు. బండి సంజయ్ తో సహా మమ్మలని ఎవరు తిట్టినా ప్రజలు మీ తోలు తీస్తరు జాగ్రత్త అని హెచ్చరించారు మల్లారెడ్డి. గుండ్ల పోచంపల్లిలో 21 ఎకరాల్లో నా యూనివర్సిటీ వుంది.. అసలు 650 సర్వే నంబర్ లేదన్నారు.600 ఏకరాల్లో 400 ఏకరాలు కాలేజీ వుందని.. రైతు బంధు ఎట్లా వస్తదని ప్రశ్నించారు. సీతక్క మంచిది కానీ.. రేవంత్ రెడ్డి ఆమెతో అలా మాట్లాడాలని చెపుతున్నాడన్నారు. ఏం చేస్తే నీకు బంజారా హిల్స్ లో బంగళాలు వచ్చాయని ప్రశ్నించారు. అవతలివాళ్లు చులకనగా చూడకు.. బొలగ వున్న అని అనికోకు.. మనసుకు తీసుకున్నాం అంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందేనని హెచ్చరించారు మల్లారెడ్డి.

నేను విసిరిన చాలెంజ్ ఒప్పుకో.. దమ్ము, దైర్యం వుంటే హుజురాబాద్ లో డిపాజిట్ తెచ్చుకో అని డిమాండ్ చేశారు మల్లారెడ్డి.