కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఎత్తైన రిజర్వాయర్ మల్లన్న సాగర్. రాష్ట్రంలోని ఎస్సారెస్పీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్ ఇది. సిద్దిపేట జిల్లా తొగుట,కొండపాక మండలం సరిహద్దులో దీనిని నిర్మించారు. 8 గ్రామాలతో పాటు మొత్తం 14 శివారు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. దీని సామర్థ్యం 50 టీఎంసీలు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్ పంప్ హౌస్ కు చేరిన గోదావరి జలాలను మల్లన్న సాగర్ లోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్ తో మొత్తంగా ఉమ్మడి మెదక్ తో పాటు ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోని దాదాపు 11.29 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఈ రిజర్వాయర్ కు 5 తూములు(స్లూయిజ్ లు) ఉన్నాయి. వీటి ద్వారా కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్ కు, సింగూర్ ప్రాజెక్టుకు, తపాస్ పల్లి రిజర్వాయర్ కు,మిషన్ భగీరథకు నీటిని తరలిస్తారు. అంతేగాకుండా హైదరాబాద్ తాగునీటి కోసం 20 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం16 టీఎంసీలు వాడుతారు.
మల్లన్న సాగర్ సామర్థ్యం
- 2018లో పనులు ప్రారంభం
- పూర్తి నీటి సామార్థ్యం- (FRL)557 మీటర్లు-50 టీంఎంసీలు
- వ్యయం రూ. 7 వేల కోట్లు
- భూసేకరణ - 17,871 ఎకరాలు
- కట్ట వెడల్పు- 440 మీటర్లు
- రిజర్వాయర్ కట్ట పొడవు- 22.4 కిలో మీటర్లు
- ఆనకట్టకు 5 ఓటీ స్లూయిస్ లు(తూములు)
- 532 మీటర్ల వరకు (10 టీఎంసీలు)నీటి నిల్వ, ఇది డెడ్ స్టోరేజీ
Tomorrow will be a momentous day in Telangana’s irrigation history as Hon’ble CM KCR Garu will be dedicating “Mallanna Sagar” to the Nation
— KTR (@KTRTRS) February 22, 2022
This 50 TMC reservoir is part of the world’s largest lift irrigation project #KaleshwaramProject and will irrigate 11.29 Lakh Acres pic.twitter.com/RlOB6mjepE