
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయ నూతన చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డిని హైదరాబాద్ చెందిన యాదవ డోనర్స్(దాతలు) గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి దాతల సహకారం ముఖ్యమన్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి రెండు ఆదివారాల్లో జంట నగరాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు సదానంద్ యాదవ్, శైలేందర్ యాదవ్, మహేశ్ యాదవ్, దుర్గా యాదవ్, ఆలయ ప్రధానార్చకులు మల్లికార్జున్ పాల్గొన్నారు.
ఒగ్గు పూజరులుగా అవకాశం కల్పించాలె
హైదరాబాద్కు చెందిన యాదవులకు కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఒగ్గు పూజారులగా అవకాశం కల్పించాలని పలువురు యాదవులు ఏఈవో అంజయ్యకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొమురవెల్లి మల్లన్న స్వామి తమ ఇంటి దైవమని, ప్రతి యేటా జాతర సమయంలో కొమురవెల్లికి వచ్చి పట్నంవారం, లష్కర్ వారంలో పట్నాలు వేసి మొక్కులు చెల్లిస్తామన్నారు. భక్తులకు సేవ చేసేందకు ఆలయంలో ఒగ్గుపూజారులుగా హక్కు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.