గుండాల, మణుగూరు ప్రధాన రహదారి సాయనపల్లి- గుండాల మధ్య మల్లన్న వాగు హై లెవెల్ బ్రిడ్జి డేంజర్ గా మారింది. భారీగా కోతకు గురైనా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు .
గతేడాది వర్షాకాలంలో ఇలానే బ్రిడ్జికి ఇరువైపులా భారీగా రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో 20 రోజులపాటు రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే ఆఫీసర్ల నిర్లక్ష్యం వీడి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
- గుండాల, వెలుగు