హైదరాబాద్: మల్లాపూర్‌లోని కింగ్స్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెనింగ్‌కు సినీ నటి హెబ్బా పటేల్ హాజరైంది. దీంతో.. డీజే, రికార్డింగ్ డ్యాన్స్‌లతో మల్లాపూర్ ప్రాంతం సందడిగా మారింది. రద్దీగా ఉండే మెయిన్ రోడ్ కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
నాచారం పోలీసులు డీజేను సీజ్ చేసి రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. జంట నగరాల్లో ఉండే ట్రాఫిక్ రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ట్రాఫిక్ సమస్యతో నరకయాతన చూస్తున్న సిటీ జనాన్ని ఇలాంటి ఆర్భాటాల పేరుతో ఇబ్బందిపెట్టడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు.