తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ముగిసింది ఈ భేటీకి మాజీ మంత్రులు,సీనియర్ నేతలు, ఎమ్మెల్సీ కవితతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. భేటీ అనంతరం గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గజ్వేల్ లోని ఎర్రవెళ్లి ఫాంహౌస్ కు బయల్దేరారు. సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు.
అయితే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.. 119 స్థానాల్లో బీఆర్ఎస్ 39 సీట్లలో గెలిచింది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓడిపోవడం పార్టీ కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. అలాగే ఆరుగురు మంత్రులు ఓటమిపాలవ్వడం ..అభివృద్ధి చేసినా కొన్ని చోట్ల అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారనేదానిపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.