
సరదా కామెంట్లతో ట్రెండింగ్ లో ఉండే మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి ఈ సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లవ్ యూ ఫాదర్ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న మల్లారెడ్డి హీరోయిన్ కసికపూర్ పై చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారారు.
హీరోయిన్ కసికపూర్ అంట..మంచి కసికసిగా ఉందంటూ మల్లారెడ్డి ఒక్కసారిగా షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్లంతా పగలబడి నవ్వారు. ఈ సినిమాలో హీరో కూడా మా కాలేజీలోనే చదివాడు..ఇపుడు హీరో అయ్యిండు.ఇదే కాలేజీలో సినిమా ప్రమోషన్ చేస్తుండు. ఈ హీరో ఫాదర్ మా కాలేజ్ ప్రిన్సిపాల్ చాలా సార్లు పిలిచాడు కానీ నాకు కుదరలేదు..ఇవాళ అసెంబ్లీకి డుమ్మా కొట్టీ మరి సినిమా ప్రమోషన్ కు వచ్చా అని మల్లారెడ్డి కామెంట్స్ చేశాడు
Also Read : ఊహించని రేంజ్ లో ‘మ్యాడ్ స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్స్..
మల్లారెడ్డి కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు. కూతురి వయసున్న హీరోయిన్ పై అలాంటి కామెంట్స్ చేస్తారా. ఓ మాజీ మంత్రిగా మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఫైర్ అవుతున్నారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టి సినిమా ప్రమోషన్లకు హాజరవుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కూడా మల్లారెడ్డి నితిన్ రాబిన్ హుడ్ సినిమా ఫంక్షన్ లో డ్యాన్స్ చేసి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.