బీజేపీ ఆఫీస్​కు మల్లారెడ్డి

బీజేపీ ఆఫీస్​కు మల్లారెడ్డి
  • తన మనవరాలి పెళ్లికి రావాలని కిషన్ రెడ్డికి ఇన్విటేషన్ 

హైదరాబాద్, వెలుగు:  బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వచ్చారు. ఆయన వెంట తన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు.  ఈ సందర్భంగా తన మనవరాలి పెళ్లికి రావాలని కిషన్ రెడ్డిని మల్లారెడ్డి ఆహ్వానించారు.

అనంతరం కిషన్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 10 నిమిషాల పాటు ఇరువురు చర్చించుకున్నారు. అనంతరం మీడియాతో మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. కిషన్ రెడ్డి తన ఫ్రెండ్ అని, 30 ఏండ్లకు పైగా తనకు తెలుసని చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. రాజకీయ అంశాలు మాట్లాడారా? అని మీడియా ప్రశ్నించగా ప్రతిసారి రాజకీయాలేనా? అంటూ ప్రశ్నించారు.