గవర్నర్ ను కలిసిన మల్లెమడుగు  జడ్పీహెచ్ఎస్​ స్టూడెంట్స్

గవర్నర్ ను కలిసిన మల్లెమడుగు  జడ్పీహెచ్ఎస్​ స్టూడెంట్స్
  • పీఎం శ్రీ ఎక్స్ క్లూజివ్ విజిట్ లో భాగంగా రాజ్ భవన్ సందర్శన

ఖమ్మం టౌన్, వెలుగు :  మల్లెమడుగు జడ్పీహెచ్​ఎస్​కు చెందిన 6వ తరగతి విద్యార్థులు మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. పీఎం శ్రీ పథకం క్రింద ఎక్స్ క్లోజిన్ విజిట్ లో భాగంగా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ ప్రోద్బలంతో రాజ్ భవన్ ను విద్యార్థులు సందర్శించారు. ప్రభుత్వ పాఠశాల్లో అమలు అవుతున్న కిచెన్ గార్డెన్స్ విధానం గురించి గవర్నర్ తెలుసుకున్నారు.

పాఠశాలలో పండించే కూరగాయలతో మధ్యాహ్న భోజనం అందించడాన్ని గవర్నర్ అభినందించారు. అనంతరం విద్యార్థులు గీసిన గవర్నర్ చిత్రపటాన్ని ఆయన అందజేసి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్ భవన్ ను పూర్తిగా చూసి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ అధికారి రామకృష్ణ, స్కూల్​ హెచ్​ఎం కృష్ణ వేణి, టీచర్లు పాల్గొన్నారు.