
‘మల్లేశం’ ఫేమ్ రాజ్ రాచకొండ రూపొందించిన తాజా చిత్రం ‘23’. తేజ, తన్మయి లీడ్ రోల్స్ చేశారు. స్టూడియో 99 సంస్థ నిర్మించింది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. శనివారం టీజర్‌ను విడుదల చేశారు. 1991 చుండూరు ఊచకోత, 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీ హిల్స్ కార్ బాంబు పేలుడు.. ఈ మూడు ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు టీజర్ ద్వారా రివీల్ చేశారు. ‘హతులందరి కథ ఒకేలా ముగిసింది.. మరి హంతకుల కథ ఒకేలా ముగిసిందా..’ అనే డైలాగ్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఇక టీజర్ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో దర్శకుడు మాట్లాడుతూ ‘టీజర్‌లో చూపించినట్లుగా ఈ ఇన్సిడెంట్స్‌లో చనిపోయిన వారు 23 మంది.
అందుకే ఈ టైటిల్ పెట్టాం. ఈ సినిమా హ్యూమన్ రైట్స్ వైపు ఉంటుంది. న్యాయం దొరకని వారి తరపున ఉంటుంది. తప్పుని తప్పని తెలుసుకోవడం ఈ సినిమా ఉద్దేశం. హింసకి వ్యతిరేకంగా.. జరిగిందే చూపిస్తున్నాం’ అని చెప్పారు. ‘నిజ జీవిత కథని రాజ్ నిజాయతీగా చెప్పాడని, దమ్ము, నిజాయతీ ఉన్న ఇలాంటి సినిమాని ప్రేక్షకులు వెతుక్కుంటూ వస్తారనే నమ్మకం ఉందని నటి ఝాన్సీ చెప్పారు. ఉన్నతి ఎన్జీఓ ఫౌండర్ డా.బీనా, నటులు తేజ, తాగుబోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు.